Header Banner

ఏపీలో కొత్త రెవెన్యూ డివిజన్లు... జిల్లాల పునర్వ్యవస్థీకరణపై స్పష్టత! మంత్రి కీలక ప్రకటన!

  Fri Mar 07, 2025 13:28        Politics

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు. శాసనమండలి సమావేశాల్లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై పలువురు ఎమ్మెల్సీలు ప్రశ్నలకు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సమాధానాలిచ్చారు. ప్రభుత్వం వద్ద జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదన లేదని చెప్పారు. గత ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణను అస్తవ్యస్తంగా చేసిందని.. అయితే బాపట్ల జిల్లా అద్దంకి, సత్యసాయి జిల్లా మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నట్లు చెప్ారు. ఎమ్మిగనూరు, ఉదయగిరి రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రతిపాదనలు కూడా ఉన్నాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఛార్జీలు పెంచి.. వాళ్లే ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. గత ప్రభుత్వ హయాంలోనే విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయని.. చివరి రెండేళ్లలో రూ.15వేల కోట్ల భారం వేసిందన్నారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


2014-19 మధ్య తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని అప్పగించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 9సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిందన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తారాల్లో భాగంగా రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, విలేజ్ హెల్త్ క్లినిక్స్, రాష్ట్రంలోని ఫ్రీ హోల్డ్ భూములు, బెల్టు దుకాణాలు, పాఠశాలలకు వెళ్లే బాలికలకు హెచ్పీవీ టీకాలు' అంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. వీటితో పాటుగా 'కమలాపురం - కడప రహదారి వంతెన, తిరుమల దర్శన టికెట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం, స్థానిక సంస్థల ఎన్నికలు, దేవాదాయ భూముల వివాదాలు' సమాధానాలు ఇచ్చారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


శాసనసభలో 'వైద్యారోగ్యం, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాలు, క్రీడలు-యువజన సేవలు, రవాణా శాఖలపై డిమాండ్లు, గ్రాంట్లపై చర్చ, ఓటిం. గృహనిర్మాణంపై చర్చ, శాసనసభ ప్రశ్నోత్తారాల్లో భాగంగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, విద్యుత్ వినియోగదారులపై భారం, టీడీఆర్ బాండ్లు, బలహీనవర్గాలకు నిధులు కేటాయింపు, చేనేత సహకార సంఘాల పునరుద్ధరణ'ల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. 'ప్రభుత్వ అప్పులు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, సీజనల్ హాస్టళ్ల ఏర్పాటు, గోరుకల్లు జలాశయం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు' ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #revenue #divisions #district #todaynews #flashnews #latestnews